బుధవారం హైదరాబాద్‌లోని MCHRDలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, ఇరిగేషన్ సెక్రటరీ శ్రీధర్, ఐఎస్బీ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రాజెక్టు రీ-డిజైనింగ్, నీటి లభ్యత, ఇతర సాంకేతిక అంశాలపై సీఎం అధికారులతో చర్చించి, ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేలా దిశానిర్దేశం చేశారు.