శనివారం సాయంత్రం కిషన్ బాగ్ అవుట్ పోస్ట్ రహదారి పక్కన గుర్తుతెలియని 65 ఏళ్ల వృద్ధుడి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మృతుడి శరీరంపై ఎర్రని నిక్కరు, తెల్లని చొక్కా ఉన్నాయని, అనారోగ్యంతో మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బహదూర్ పుర పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.