హైదరాబాద్, బెంగళూరు మధ్య ప్రయాణ సమయం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్ నడపాలని యోచిస్తోంది. దేశవ్యాప్తంగా ఎకనామిక్ కారిడార్ల మధ్య బుల్లెట్ ట్రైన్ల ఏర్పాటులో భాగంగా హైదరాబాద్-బెంగళూరు మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ బుల్లెట్ ట్రైన్ కర్నూలు జిల్లా మీదుగా వెళ్లేందుకు మార్గం సుగమం అవుతోంది. అందుకు అనువైన ట్రాక్ నిర్మించేందుకు అధికారులు మట్టి నమూనాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి.