ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం స్థల సేకరణ..

1చూసినవారు
హైదరాబాద్ పాతబస్తీలోని ఫలక్ నుమ ఫారుఖ్ నగర్ లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం బుధవారం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మంత్రి అజారుద్దీన్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, బహదూర్ పుర ఎమ్మెల్యే ముబీన్ లు వివిధ శాఖల అధికారులతో కలిసి సర్వే నెంబర్ 266/1 లోని 13 ఎకరాలలో నాలుగు ఎకరాల ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. స్థల సేకరణ ప్రక్రియలో భాగంగా ఈ పరిశీలన జరిగింది.