రాంపల్లి మహాలక్ష్మినగర్లో తమ ప్లాట్లపై ద్వంద్వ రిజిస్ట్రేషన్లు చేసి భూకబ్జా చేశారని నాంపల్లి రమేశ్ రావు కీసర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ప్రధాన నిందితుడు మహమ్మద్ ఖాజా, రియల్ ఎస్టేట్ బ్రోకర్, మరో వ్యక్తి రామచంద్రయ్యను అరెస్టు చేశారు. విచారణలో నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు తేలింది.