నూతన సంవత్సర వేడుకలు ముగిసిన వెంటనే, చార్మినార్ పరిసరాల్లో పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేశారు. భాగ్యలక్ష్మి టెంపుల్, చార్మినార్ ప్రాంతాల్లోని సందర్శకులు, యువతను నిర్దేశిత సమయం తర్వాత అక్కడి నుండి పంపించివేశారు. శాంతిభద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.