హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

1969చూసినవారు
హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో, పని ఒత్తిడిని తట్టుకోలేక సతీష్ (31) అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అమలాపురం ప్రాంతానికి చెందిన సతీష్ గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం వివాహం చేసుకున్న సతీష్, తన సోదరుడితో కలిసి మియాపూర్లో నివాసం ఉంటున్నాడు. సంక్రాంతికి భార్య సొంతూరు వెళ్లిన సమయంలో, తన గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పని ఒత్తిడి కారణంగానే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్