తలకొండపల్లి మండలంలోని మాదాయిపల్లి గ్రామానికి చెందిన భయ్యా రమేష్, అతని భార్య సుజాత, వారి మూడేళ్ల కుమారుడు అభి మిడ్జిల్ మండలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఆటోలో వెళ్లి, చికిత్స అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. వెల్జాల్ గ్రామ శివారులో కుక్కను తప్పించబోయి, రాయిపై టైరు ఎక్కడంతో ఆటో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో అభికి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.