యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని తమ్మలోని గూడ గ్రామంలోని కోళ్ల ఫారంలో పనిచేస్తున్న జాయ్ దొర్ అలీ కుటుంబం నూతన సంవత్సరం రోజున బంగాళాదుంప, బొమ్మిడి చేపలతో భోజనం చేసింది. అర్ధరాత్రి వాంతులు, విరేచనాలతో బాధపడటంతో కుటుంబ సభ్యులను నగరంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మూడేళ్ల బాలుడు శుక్రవారం మృతి చెందాడు. మిగిలిన వారు కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.