రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం పరిధిలోని చిలుకూరు బాలాజీ టెంపుల్ ఆలయ ప్రధాన అర్చకులు సౌందర్ రాజన్ (90) వృద్ధాప్యంతో బాధపడుతూ కన్నుమూశారు. ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. సౌందర్ రాజన్ గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నట్లు పేర్కొన్నారు.