శంకర్ పల్లి మండలం జన్వాడ గ్రామానికి చెందిన వడ్ల బాల సాయి చారి (32), పద్మ (25) అనే దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా వీరు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పటేల్ గూడా గ్రామంలో అద్దె ఇంట్లో ఉంటూ ఫోటోగ్రాఫర్ గా జీవనం సాగిస్తున్నారు. వీరికి ఐదు నెలల బాబు ఉన్నాడు. మూడు రోజుల క్రితం స్వగ్రామానికి శంకర్ పల్లి మండలం జన్వాడ గ్రామానికి వచ్చి పాత ఇంట్లో ఉంటున్న వీరిద్దరూ ఆర్థిక కారణాలతో ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుని తమ్ముడు తలుపులు పగులగొట్టి చూడగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.