తుర్కయంజాల్ లో అగ్ని ప్రమాదం

926చూసినవారు
తుర్కయంజాల్ లో అగ్ని ప్రమాదం
తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కమ్మగూడలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఓ ఇంట్లో ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఇంటి యజమాని అప్రమత్తతతో ఇంట్లోని సామాగ్రిని బయటకు తరలించారు. అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ, సుమారు 1,50,000 రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు, అయితే ఐదు లక్షల విలువైన వస్తువులను కాపాడినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నాగేశ్వర్ రావుతో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్