రంగారెడ్డి: బస్సు ప్రమాదం.. 25 మందిపై కేసు నమోదు ?

3387చూసినవారు
రంగారెడ్డి: బస్సు ప్రమాదం.. 25 మందిపై కేసు నమోదు ?
చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో కంకర టిప్పర్, తాండూరు ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘోర ప్రమాదంలో 13 మంది మృతి  చెందిన నేపథ్యంలో, తాండూర్ డెవలప్మెంట్ ఫోరం పిలుపు మేరకు ప్రజా సంఘాల నాయకులు, విద్యావంతులు, యువకులు 'సేవ్ తాండూర్' నిరసన చేపట్టారు. తాండూర్ నుంచి హైదరాబాద్ రోడ్డు విస్తరించాలని డిమాండ్ చేస్తూ, స్థానిక పాలకులే ప్రమాదానికి కారణమని ఆరోపించారు. అయితే, ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోలేదని, ప్రజలకు, ద్విచక్ర వాహనదారులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ, నిరసనలో పాల్గొన్న 25 మందిపై తాండూర్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్