రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఆస్తి తగాదాలు తీవ్రమయ్యాయి. చెల్లెలు స్వప్న తనను ఇబ్బంది పెడుతోందని భావించిన అన్న, సుపారీ గ్యాంగ్‌తో ఆమెను హత్య చేయించాడు. ఉదయం పొలానికి వెళ్లిన సమయంలో, ముసుగులు ధరించిన దుండగులు కారులో వచ్చి స్వప్నను కత్తితో పొడిచి చంపి పారిపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.