రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ధ్వంసమైన బస్సు ముందు భాగాన్ని చూస్తే ప్రమాద తీవ్రత అర్థమవుతోంది. గాయపడ్డవారిని వెంటనే చేవెళ్ల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.