ప్రజల ఆత్మనిర్భరతను పెంపొందించేందుకు కృషి చేస్తూ లయన్స్ క్లబ్ అఫ్ సికింద్రాబాద్ పారడైస్ ఆధ్వర్యంలో సావర్కర్ నగర్ రెసిడెంటిల్ అసోసియేషన్ సహకారంతో స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం అనే లక్ష్యంగా 4వ తారీకున సావర్కర్ నగర్ కల్చరల్ హాల్, నాచారం క్రాస్ రోడ్స్ లో ఉచిత వృత్తి శిక్షణ కేంద్రం ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా ముఖ్యంగా మహిళలు మరియు యువతకు దర్జీ శిక్షణ (టైలరింగ్), మరియు ఇతర వృత్తి నైపుణ్యాలు ఉచితంగా అందించబడతాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ అతిధిగా లయన్ గంపా నాగేశ్వర్ రావు - 320H జిల్లా గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ "ఈ శిక్షణ కేంద్రం ద్వారా అనేక కుటుంబాలు ఆర్థికంగా ఎదగడానికి మార్గం సుగమం అవుతుంది" అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సికింద్రాబాద్ పారడైస్ అధ్యక్షులు లయన్ చంద్రమోహన్ నరేసేపల్లి జిల్లా కాబినెట్ సెక్రటరీ లయన్ కమలాకర్ ముస్త్యాల,ప్రాజెక్ట్ చైర్మన్ లయన్ యమ్ ఎస్ ప్రకాష్, పారడైస్ క్లబ్ సభ్యులు, సావర్కర్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ వెంకరమణ రెడ్డి, సెక్రటరీ బొగ్గారాపు రమేష్, ఇతర కాలనీ ఈసీ మెంబెర్స్, స్థానిక ప్రముఖులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ శిక్షణ కేంద్రం ద్వారా నెలకు 50 మందికి పైగా శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ ముగిసిన వారికి సర్టిఫికెట్ కూడా అందించబడుతుంది. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు మాత్రమే శిక్షణకు అర్హులు. ఇలాంటి శాశ్వత ప్రాజెక్టులు గ్రామీణ మరియు పట్టణ వాసుల కోసం వెలుగుగా నిలుస్తాయని నిర్వాహకులు తెలిపారు.