
పిరాయింపు ఎమ్మెల్యేల స్పీకర్ నిర్ణయంపై స్పందించిన కేటీఆర్
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి లకు స్పీకర్ క్లిన్ చిట్ ఇవ్వడాన్ని కేటీఆర్ ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడిగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్ ఇవ్వడం ప్రజల తీర్పును అవమానించడమేనని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.






































