ప్రభుత్వ ఆసుపత్రుల్లో శానిటేషన్, పేషెంట్ కేర్ సెక్యూరిటీ కార్మికుల జతల పెంపు కోసం ఎఐటియుసి ఆధ్వర్యంలో మంగళవారం ఫీవర్ ఆసుపత్రి, కింగ్ కోఠి ఆసుపత్రి వద్ద నిరసన చేపట్టారు. జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు అమలు చేయాలని, టెండర్ గడువు ముగిసినందున నూతన టెండర్లు ఆహ్వానించి కనీస వేతనాలు చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ నిరసన ద్వారా కార్మికులు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు.