సుల్తాన్ బజార్ పోలీసులు ఏటీఎంల వద్ద అమాయకులను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర కేటుగాడిని అరెస్ట్ చేశారు. సాయం చేస్తానని నమ్మించి, నకిలీ NEFT మెసేజ్‌లు చూపి నగదు దోచుకునేవాడు. ఇతనిపై 73 కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఒక మహిళ వద్ద రూ. 1 లక్ష కొట్టేయగా, పోలీసులు రూ. 2. 40 లక్షలు ఫ్రీజ్ చేశారు. అపరిచితులకు నగదు ఇవ్వొద్దని ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి సూచించారు.