మీనాక్షి నామినేషన్ తిరస్కరణ వెనుక బీజేపీ కుట్ర

1చూసినవారు
TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శనివారం హైదరాబాద్ గాంధీభవన్‌లో మాట్లాడుతూ, రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక ప్రధాని కార్యాలయం, బీజేపీ కుట్ర ఉందని ఆరోపించారు. క్రైమ్ నంబర్ కూడా లేని ఓ ప్రైవేట్ కేసు ఆధారంగా నామినేషన్ తిరస్కరించడం దేశ రాజకీయాల్లో పెద్ద కళంకమని ఆయన అన్నారు. పార్టీ అంతర్గత సమాచారాన్ని బయటకు చేరవేసిన వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.