ST సబ్సిడీలు విడుదల చేయాలని బీజేపీ ST మోర్చా ధర్నా

4చూసినవారు
ST సబ్సిడీలు విడుదల చేయాలని బీజేపీ ST మోర్చా ధర్నా
పెండింగ్‌లో ఉన్న SC, ST లబ్ధిదారుల సబ్సిడీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ST మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నేనావత్ రవి నాయక్ ఆధ్వర్యంలో సోమవారం ఇండస్ట్రియల్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ పాల్గొని లబ్ధిదారుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అర్హులైన SC, ST లబ్ధిదారులకు పెండింగ్‌లో ఉన్న సబ్సిడీలను త్వరితగతిన విడుదల చేసి, వారి స్వయం ఉపాధి, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని నాయకులు డిమాండ్ చేశారు. ధర్నాలో మహబూబాబాద్ బీజేపీ ST మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొని నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్