
టీవీకే అధినేత విజయ్ ర్యాలీకి ఎన్నికల సంఘం అనుమతి
తమిళనాడులో టీవీకే పార్టీ ర్యాలీకి ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. టీవీకే చీఫ్ విజయ్, ఎన్నికల సంఘాన్ని కలిసి వినతిపత్రం అందించారు. ఈ నెల 17న పెరంబూరు నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. చెన్నైలో ఐదుచోట్ల ఎన్నికల ప్రచారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు విజయ్ వెల్లడించారు.




