ప్రభుత్వ కార్యాలయాలను తగులబెట్టాలంటూ బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై
కాంగ్రెస్ విప్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడిన సుమన్‌పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వ విప్‌లు బల్మూర్ వెంకట్, అద్దంకి దయాకర్ మంగళవారం హైదరాబాద్ లక్డికాపూల్ లో డీజీపీని కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.