హైదరాబాద్ లో ఇంధన కొరత.. బంకుల ముందు వాహనాల క్యూ

715చూసినవారు
హైదరాబాద్‌లో మళ్లీ కృత్రిమ ఇంధన కొరత నెలకొన్నట్లు తెలుస్తోంది. పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా క్యూలలో నిలుస్తున్నారు. పలు బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు కనిపించడంతో వాహనదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సరఫరా లోపాలపై అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. పెట్రోల్, డీజిల్ సరఫరాపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.