గౌలిగూడలోని జంగల్ విఠోభా మందిర్ ఆధ్వర్యంలో తొలి ఏకాదశి సందర్భంగా ఘనంగా రథయాత్ర నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో గోషామహల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొని భక్తులతో కలిసి రథాన్ని లాగుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవం భక్తిశ్రద్ధలతో సాగగా, ప్రజలు పెద్దఎత్తున హాజరై భక్తి వాతావరణాన్ని సృష్టించారు.