హైదరాబాద్: ఆర్టీసీ బస్సు- లారీ ఢీ.. 15 మందికి తీవ్ర గాయాలు

868చూసినవారు
హైదరాబాద్ నుంచి మెదక్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కొల్చారం జాతీయ రహదారిపై ధాన్యం లారీని ఓవర్‌టేక్‌ చేస్తుండగా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను మెదక్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్