గురువారం గాంధీభవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ తన నోటిని ఫినాయిల్‌తో కడుక్కోవాలంటూ ఆయన ఫినాయిల్ ప్యాకెట్ పంపించారు. బీఆర్ఎస్ హయాంలో రైతులను ఇబ్బందులకు గురిచేశారని, కేసీఆర్ తెలంగాణ రైతులను వదిలి పంజాబ్‌లో చెక్కులు పంచారని సాయికుమార్ ఆరోపించారు. రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు కమిషన్ ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు.