బస్సు ఢీకొని.. వ్యక్తి మృతి

1674చూసినవారు
బస్సు ఢీకొని.. వ్యక్తి మృతి
హైదరాబాద్ నగరంలో రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వ్యక్తిని ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ నెల 27న నాంపల్లి హ్యాండ్ లూమ్ హౌస్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 32 ఏళ్ల వ్యక్తిని ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఈ నెల 29న రాత్రి అతను మృతి చెందాడు. మృతుడి ఎత్తు 5.7 అడుగులు, ఎడమ చేతిపై 'నిషా, ప్రిన్సి' అని రాసి ఉంది. నలుపు రంగు టీ షర్టు, జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీలో ఉంచారు. సంబంధీకులు 871661245, 8712660134 నంబర్లలో సంప్రదించాలని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్