ధూల్‌పేట్ లోని శివలాల్‌నగర్‌లో అనిషాసింగ్ అనే వివాహిత, తనను వేధిస్తున్న సాయినాథ్ సింగ్ (26) అనే యువకుడిని హత్య చేసింది. ఆమెను స్థానికంగా ఉన్న అతను తరచూ వేధించడంతో భర్తకు చెప్పింది. భర్త హెచ్చరించిన పట్టించుకోలేదు. సోమవారం కలవాలని వేధించడంతో రహీంపుర లోని తన పుట్టింట్లో ఉన్నానని అక్కడికి రావాలని చెప్పడంతో అక్కడికి వెళ్ళగానే చున్నీతో గొంతు నులిమి చంపింది. అయితే ఈ హత్యలో మరికొంతమంది సహకరించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.