అక్రమ నిర్మాణాలపై కొరడా జలుపించిన ఎమ్మార్వో

643చూసినవారు
అక్రమ నిర్మాణాలపై కొరడా జలుపించిన ఎమ్మార్వో
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మండలం, దొమ్మర పోచంపల్లి సర్వే నెం. 120లోని ప్రభుత్వ భూమిలో సుమారు 10-15 అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు శనివారం జేసీబీ సాయంతో కూల్చివేశారు. గతంలో అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకునే ప్రయత్నించినప్పుడు కొందరు నిర్మాణదారులు అడ్డుకున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని గండిమైసమ్మ, దుండిగల్ మండల తహసీల్దార్ ఎన్. రాజేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్