దేశవ్యాప్తంగా ఏర్పడుతున్న పొలిటీషియన్స్ జేఏసీ తెలంగాణ విభాగాన్ని పటిష్టపరచేందుకు ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో నాగుల శ్రీనివాస్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యమంలో పాల్గొన్న నాయకులకు రాజకీయ అవకాశాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటానని తెలిపారు.