కూకట్‌పల్లి అయ్యప్ప స్వామి ఆలయంలో పంగుని ఉత్తిరం పర్వదినాన్ని పురస్కరించుకుని జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు, ఆలయ చైర్మన్ వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొన్నారు. పంగుని ఉత్తిరం ప్రతి మనిషిలోని దైవత్వాన్ని మేల్కొలిపే పవిత్ర సమయమని, అయ్యప్ప జయంతి నియమం, ధర్మం, భక్తికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెరగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అర్చకుల పర్యవేక్షణలో అభిషేకం, అర్చన, మహా హారతి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.