జేబీఎస్‌ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం

430చూసినవారు
జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ఆర్టీసీ బస్సు అతివేగంతో ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో శివ అనే ద్విచక్రవాహనదారుడు బస్సు చక్రాల కింద ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డాడు. మారేడుపల్లి ట్రాఫిక్ పోలీసులు, వాహనదారుల సకాలంలో స్పందించి, క్రేన్ సహాయంతో బస్సును పక్కకు జరిపి శివను రక్షించి, ఆసుపత్రికి తరలించారు. జేబీఎస్ నుంచి కార్ఖానా వైపు వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది.

సంబంధిత పోస్ట్