రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) కలిసి ఒరిస్సా నుండి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న దాదాపు 9.402 కిలోల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 1 కోటి రూపాయలు. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన కొరాబు చాంటి బాబు (35) అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. ఒరిస్సాకు చెందిన రాజారావు, మరో గుర్తుతెలియని వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.