హైదరాబాద్: మరోసారి గ్యాంగ్ అరాచకాలు

2చూసినవారు
హైదరాబాద్: మరోసారి గ్యాంగ్ అరాచకాలు
చంపాపేట్ నగరంలోని సంతోష్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 'మాయా గ్యాంగ్' సభ్యులు బాసిత్ అనే యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. సోహైల్, సౌద్ అనే వ్యక్తులు అకారణంగా దాడి చేయడంతో బాధితుడు గాయపడ్డాడు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డయింది. గాయపడిన బాసిత్ ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గతంలోనూ 'మాయా గ్యాంగ్' పై కేసులు నమోదైనట్లు సమాచారం. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్