కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ ప్రాంతంలో గురువారం గుబ్బల సాయికిరణ్ (32) అనే యువకుడు కుటుంబ కలహాల కారణంగా మనస్థాపానికి గురై తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, మృతుడి తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.