గండిపేట మండలం నార్సింగి-మంచిరేవుల మధ్య ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డులో శుక్రవారం రాత్రి వరదలో నలుగురు చిక్కుకున్నారు. ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తడంతో భారీ వరద కారణంగా ఈ సంఘటన జరిగింది. బారికేడ్లు ఉన్నప్పటికీ, ఆటో ట్రాలీలో వెళ్లిన డ్రైవర్ తో పాటు నలుగురు వరదలో చిక్కుకున్నారు. డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు వెంటనే స్పందించి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అనంతరం ఆటో ట్రాలీని డీఆర్ఎఫ్ వాహనంతో బయటకు లాగారు.