యాచారం మండలం మంతన్ గౌరెల్లి గ్రామంలో 90 ఏళ్ల వృద్ధురాలిపై జరిగిన అత్యాచారం సంఘటన సభ్య సమాజాన్ని కలిచివేసింది. బుధవారం అర్ధరాత్రి ఆమె ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగుడు దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా ప్రతిఘటించినా, దుండగుడు ఆమెపై దాడి చేసి అత్యాచారం చేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.