రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ పరిధిలోని హిమాయత్ సాగర్‌లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. చేపలు పట్టేందుకు వెళ్లిన ముగ్గురు స్నేహితులు సరదాగా ఈత కొట్టేందుకు నీటిలోకి దిగగా, ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు నీటిలో మునిగి మృతి చెందారు. టోలీచౌకి ప్రాంతానికి చెందిన షేక్ సల్మాన్, షాబాజ్లుగా పోలీసులు గుర్తించారు. మరో యువకుడు ప్రాణాలతో బయటపడగా, అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.