
హైదరాబాద్: నంబర్ ప్లేట్ లేని వాహనదారుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న వాహనదారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా, నంబర్ ప్లేట్‌ను డిక్కీలో దాచినట్లు, ఆ వాహనంపై ఇప్పటికే 22 చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. నంబర్ ప్లేట్‌పై మాస్కులు వేయడం, అంకెలు మార్చడం వంటి చర్యలకు పాల్పడితే భారీ జరిమానాతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని నగర ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.


































