పదో తరగతి పరీక్షల ఫలితాల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు హైదరాబాద్ సీపీ సచ్చనార్ కీలక సూచనలు చేశారు. ఇటీవల ఇంటర్మీడియట్ ఫలితాల తర్వాత జరిగిన ఆత్మహత్యలు తనను తీవ్రంగా కలచివేశాయని, మార్కులు తక్కువ వచ్చినా లేదా విఫలమైనా ప్రాణాలు తీసుకోవడం ఏ సమస్యకూ పరిష్కారం కాదని, అది కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తుందని తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్య కేసులపై మహిళా భద్రత విభాగం అధికారులు దర్యాప్తు చేసి, బాధిత తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు కొన్ని దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు.