జూబ్లీహిల్స్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీగా 158 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కేరళలో సస్పెండ్ అయిన CISF కానిస్టేబుల్ శివకృష్ణను అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న గంజాయి సరకును జూబ్లీహిల్స్ పరిధిలో పట్టుకున్నారు. నిందితుడిపై నగరంలోని పలు PSలలో కేసులు నమోదైనట్లు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులతోనే అతడు గంజాయి రవాణాకు పాల్పడినట్లు విచారణలో తేలింది.