జూబ్లీహిల్స్: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తగవు: బీజేపీ ఎంపీ

78చూసినవారు
జూబ్లీహిల్స్: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తగవు: బీజేపీ ఎంపీ
తమిళనాడు ప్రతినిధుల ఆహ్వానంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన సరికాదని బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్ గురువారం హైదరాబాదులో విమర్శించారు. దక్షిణాదిపై బీజేపీ కుట్ర చేస్తున్నదనే వ్యాఖ్యలు ముఖ్యమంత్రి స్థాయికి తగవన్నారు. 2026లో రాజ్యాంగ సవరణ తర్వాతనే డీలిమిటేషన్ చట్టం వస్తుందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని, దాన్ని దాచిపెట్టేందుకు అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్