బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని ఏపీఎస్డీఎంఏ వెల్లడించింది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉంది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. భద్రాచలంలో 22 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 9.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.