బేగంపేట్‌లోని క్యులినరీ హోటల్ మేనేజ్‌మెంట్ అకాడమీలో డ్రగ్స్ కలకలం రేగింది. చివరి సంవత్సరం చదువుతున్న ఆరుగురు విద్యార్థులు గంజాయి సేవించినట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్ టెస్టులో ఆరుగురు విద్యార్థులకు పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చి, వారిని డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించారు.