రేషన్ కార్డుదారులకు రేవంత్ సర్కార్ శుభవార్త: జొన్నల పంపిణీకి నిర్ణయం

0చూసినవారు
రేషన్ కార్డుదారులకు రేవంత్ సర్కార్ శుభవార్త: జొన్నల పంపిణీకి నిర్ణయం
తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి రేవంత్ సర్కార్ శుభవార్త అందించింది. రేషన్ కార్డుదారులకు జొన్నలు కూడా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. రైతుల నుంచి ప్రభుత్వం వీటిని సేకరించి రేషన్ కార్డు లబ్దిదారులకు పంపిణీ చేయనుంది. మార్క్‌ఫెడ్ ద్వారా రైతుల నుంచి జొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. అనంతరం రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు అందించనుంది. ప్రజాభవన్‌లో రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ కీలక ప్రకటన చేశారు. జొన్నలు పంపిణీ చేయడం వల్ల పేదల ఆకలి తీరడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని, సామాన్యుడి సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడంపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. యాసంగి పంటకు సంబంధించి జొన్నలు, మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర సహకారం లేకపోవడంతో రాష్ట్ర నిధులతోనే సేకరించనున్నట్లు తెలిపింది. ఇప్పటికే మొక్కజొన్న కొనుగోళ్లు మొదలవ్వగా.. జొన్నల కొనుగోళ్లు కూడా త్వరలో ప్రారంభించనుంది.

సంబంధిత పోస్ట్