ఎన్‌సిఆర్‌టిసిలో ప్రభుత్వ ఉద్యోగాలు: ఏప్రిల్ 9 నుండి దరఖాస్తులు ప్రారంభం

5చూసినవారు
ఎన్‌సిఆర్‌టిసిలో ప్రభుత్వ ఉద్యోగాలు: ఏప్రిల్ 9 నుండి దరఖాస్తులు ప్రారంభం
ప్రభుత్వ ఉద్యోగం మరియు అధిక జీతం ఆశిస్తున్న అభ్యర్థులకు నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎన్‌సిఆర్‌టిసి) శుభవార్త అందించింది. సివిల్, ఎలక్ట్రికల్, సిగ్నలింగ్, టెలీకమ్యూనికేషన్ విభాగాల్లో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వంటి వివిధ పోస్టుల భర్తీకి ఎన్‌సిఆర్‌టిసి నియామక ప్రక్రియను ప్రకటించింది. ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ 9 నుండి మే 9 వరకు ఎన్‌సిఆర్‌టిసి అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా అనేక ఖాళీలు భర్తీ చేయబడతాయి.