హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఐకియా షోరూం వద్ద స్నేహితుడి కారు ఆగిపోవడంతో సహాయం చేయడానికి వెళ్లిన యువకుడిపై ట్రాఫిక్ పోలీసులు దౌర్జన్యం చేశారు. పరిస్థితిని అర్థం చేసుకోకుండా చలాన్ వేస్తానని బెదిరించి, తోస్తూ దాడికి పాల్పడ్డారు. కారుతో పాటు బైక్‌కు కూడా చలాన్ కొడతానని బెదిరించారు. స్థానికులు యువకులకు మద్దతుగా రావడంతో ట్రాఫిక్ పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.