చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను టోయింగ్ వ్యాన్‌లో తరలించడంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. మరణించినవారికి కనీస గౌరవం కూడా లభించకపోవడం బాధాకరమని, రాష్ట్రంలో అంబులెన్స్‌లు, మార్చురీ వ్యాన్లు అందుబాటులో లేవా అని ఆయన ప్రశ్నించారు. తోపుడు బండ్లు, చెత్త వ్యాన్లలో మృతదేహాలను తరలించడం అమానవీయమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.