జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ మద్దతు ప్రకటించింది. జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి శనివారం బషీర్ బాగ్ లో మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ పదేళ్ల పాలనను దోపిడీ, నిరంకుశ పాలనగా అభివర్ణిస్తూ, బీఆర్ఎస్ ను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.